తృణమూల్ నుండి రాజ్యసభకు ప్రశాంత్ కిశోర్‌..!

389
prashant kishor
- Advertisement -

ప్రశాంత్ కిశోర్..రాజకీయాల నుండి కాసింత అవగాహన ఉన్న పరిచయం అక్కర్లేని పేరు. పొలిటికల్ ఎనలిస్టుగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసున్న ప్రశాంత్‌ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుండి రాజ్యసభకు ప్రశాంత్ పేరును పరిశీలిస్తున్నారు సీఎం మమతా బెనర్జీ.

జేడీయూ నుండి బహిష్కరణకు గురైన తర్వాత ఎన్డీఏ సర్కార్‌పై దూకుడు పెంచిన ప్రశాంత్…ప్రస్తుతం బెంగాల్‌లో మమతా,తమిళనాడులో డీఎంకే తరపున పనిచేస్తున్నారు. బెంగాల్‌లో మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్‌ను రాజ్యసభకు పంపాలన్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మార్చిలో 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ నుంచి నలుగురి పదవీకాలం పూర్తవుతుండడంతో అక్కడ నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నాలుగు స్ధానాలను టీఎంసే గెలవనుండటంతో ప్రశాంత్ కిశోర్ ఎన్నికకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. దీనికి తోడు ప్రశాంత్‌ని పెద్దల సభకు పంపడం ద్వారా పార్టీ మరింతగా బలపడుతుందని మమత అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.

- Advertisement -