జేడీయూ.. నెంబర్‌ 2గా ప్రశాంత్ కిశోర్

364
Prashant Kishor
- Advertisement -

అంతా ఉహించినట్లే జరిగింది. జేడీయూ(జనతాదళ్ యునైటెడ్‌) ఉపాధ్యక్షుడిగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ని నియమించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. నెల క్రితం జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్‌..నితీశ్‌కు అత్యంత సన్నిహత వ్యక్తుల్లో ఒకరు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని కట్టబెట్టారు నితీష్‌.ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల్లో జేడీయూని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బక్సర్ ఎంపీ స్ధానం నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. సాసారామ్ ప్రాంతానికి ప్రశాంత్..2015లో బీహార్లో మహాకూటమి అధికారంలోకి రావడంతో కీలకపాత్ర పోషించారు.

2014 ఎన్నికల్లో మోడీ విజయంలో ప్రశాంత్ పాత్ర మరువలేనిది. సోషల్ మీడియా ద్వారా బీజేపీ,మోడీ పాపులారిటీని పెంచడంలో సక్సెస్ అయ్యారు. అనంతరం జరిగిన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేసిన కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు. కానీ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ తరపున ఎన్నికల వ్యుహకర్తగా ఉన్నారు.

- Advertisement -