ప్రశాంత్ కిషోర్ రాజకీల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. పొలిటికల్ ఎనలిస్టుగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం బెంగాల్‌లో మమత కోసం పనిచేస్తున్న కిషోర్…తాజాగా తమిళనాడులో కమల్ తరపున పనిచేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది.
కమల్‌ని సీఎం కూర్చిపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా మిషన్ 500 ప్రణాళికను ప్రశాంత్ కిశోర్ బృందం కమల్‌కు అందజేసింది. కమల్ మక్కల్ నీది మయ్యం(MNM)పై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది ఐ ప్యాక్ బృందం.
డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని పనులను 500 రోజుల్లోపు పూర్తి చేసి, శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించడం పార్టీని ఏవిధంగా బలోపేతం చేయవచ్చనేదానిపై సమగ్ర విశ్లేషణ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను ప్రశాంత్ కిశోర్ కలవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.