అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7.30గం.లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 గం. నుండి 5.30 గం.ల వరకు శ్రీవారిని ఊంజల్ మండపమునకు వేంచేపు చేశారు. సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.
అనంతరం రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు. గరుడ సేవను తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జూన్ 12న గురువారం ఉదయం 8.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామి వారు వివరించనున్నారు.
Also Read:BRS:జూన్ 11 తెలంగాణకు బ్లాక్ డే

