చిన్న చిత్రాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి:ప్ర‌స‌న్న కుమార్‌

28
- Advertisement -

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, G.రాంబాబు యాదవ్, R.వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జనవరి 5న విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చి రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఈవెంట్‌లో

నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్‌ మాట్లాడుతూ.. ‘చెన్నై నుంచి హైద్రాబాద్‌కు ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతున్న టైంలో వెంకటేశ్వరరావు ఎంతో సహకరించారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్‌లోకి వెళ్లారు. శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు అందరూ కలిసి తీసిన చిత్రం రాఘవరెడ్డి. ఇందులో అన్ని రకాల అంశాలు, ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. బాలకృష్ణ తీసిన సింహా టైపులో అనిపించింది. ఎంతో గ్రాండియర్‌గా కనిపించింది. బాలకృష్ణ బాల గోపాలుడు చిత్రంలో కళ్యాణ్ రామ్, రాశి ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. కళ్యాణ్ రామ్ డెవిల్ ఈ వారం వస్తోంది. వచ్చే వారం రాశి నటించిన రాఘవ రెడ్డి వస్తోంది. అన్ని జానర్లలతో అద్బుతమైన సినిమాలు తీయగల సత్తా సంజీవ్ మేగోటి గారికి ఉంది. శివ కంఠమనేని ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతుంటారు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. డబ్బు కోసం ఎప్పుడూ కూడా ఆయన సినిమాలు చేయలేదు. చిన్న చిత్రాల వల్లే ఇండస్ట్రీ బతుకుతోంది. ఇలాంటి చిన్న సినిమాలుంటేనే ఇండస్ట్రీలో నిలబడుతుంది. మీడియా సైతం ఇలాంటి చిన్న మూవీస్‌ను సహకరించాలి. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ఇలాంటి చిత్రాలను విజయవంతం చేయాల’ని కోరుకుంటున్నాను.

శివ కంఠమనేని మాట్లాడుతూ.. ‘రాఘవరెడ్డి నాకు నాలుగో చిత్రం. ఇందులో రాశీ గారిది ఒక ట్రాక్. నందితా శ్వేతది ఇంకో ట్రాక్. మూడు ట్రాకులు అద్భుతంగా వచ్చాయి. కామెడీ ట్రాక్ కూడా బాగా వచ్చింది. ఇంటర్వెల్ సీన్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్ ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. అందరూ కంటతడి పెడతారు. నందితా శ్వేతా చాలా చక్కగా నటించారు. మిగతా ఆర్టిస్టులు కూడా అద్భుతంగా నటించారు. రాఘవరెడ్డితో మంచి ప్రశంసలతో పాటు లాభాలు కూడా వస్తాయి. జనవరి 5న రాబోతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

రాశి మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌గా నేను ఇది వరకు ఎన్నో చిత్రాలు చేశాను. ఈ కథ చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. చాలా వేరియేషన్స్ ఈ పాత్రలో ఉంటాయి. తల్లిగా ఈ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. కూతురే ప్రపంచంగా బతికే ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. నేను ఇందులో ఫుల్ సీరియస్ మోడ్‌లోనే ఉంటాను. శివ కంఠమనేని గారు సెట్స్ మీద ఎంతో కూల్‌గా ఉంటారు. జనవరి 5న మా చిత్రం రాబోతోంది. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దామ’ని అన్నారు.

Also Read:Harishrao:మెదక్‌లో ఓడిపోవడం బాధాకరం

- Advertisement -