The Kerala Story 2 దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్.. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్ నేరుగా సినిమా లేదా దర్శకుడి పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా స్పందించారు.
సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఆయన వివిధ ఆహార అలవాట్లను ప్రస్తావిస్తూ ఓ పోస్టు షేర్ చేశారు. అందులో ..వీగన్స్, వెజిటేరియన్స్, ఎగ్‌టేరియన్స్, నాన్-వెజిటేరియన్స్ (పంది మాంసం తినని వారు), నాన్-వెజిటేరియన్స్ (గొర్రె/బీఫ్ తినని వారు), అన్ని రకాల మాంసం తినేవారు, చేపలు మాత్రమే తినేవారు – మనం అందరం సమాజంగా కలిసికట్టుగా జీవిద్దాం అని పేర్కొన్నారు. దీనికి సాధారణ విషయాన్ని ఎందుకు క్లిష్టం చేస్తాం? అనే క్యాప్షన్ జోడించారు.
ఇంతకుముందు కూడా ఆయన కేరళ వంటకాలైన పంది కూర, బీఫ్ ఫ్రై, చేపల కూర, శాకాహార ఓణం చిత్రాలను షేర్ చేస్తూ..అసలు #KeralaStory అంటే వివిధ వంటకాలు కలసి సామరస్యంగా ఉండటమే అని వ్యాఖ్యానించారు.
దీనిపై మాట్లాడిన కమాఖ్య నారాయణ్ సింగ్…ప్రకాశ్ రాజ్ గొప్ప నటుడని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన మనిషిగా కూడా తక్కువగా అనిపిస్తున్నారు అని అన్నారు. సమాజంలో బలవంతంగా మతమార్పిడి వంటి అంశాలు అసహ్యకరమని, అటువంటి విషయాలను తేలికగా తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు.ఈ వివాదం సినిమా విడుదలకు ముందు మరింత చర్చకు దారితీసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read:బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

