- Advertisement -
కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో పేదవారిని ఆదుకునేందుకు దాతలు పెద్దసంఖ్యలో ముందుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ లిస్టులో మొదటివరుసలో ఉన్నారు సినీనటుడు ప్రకాష్ రాజ్.
ఇప్పటికే పలుదఫాలుగా తనవంతు సహాయసహకారాలు అందిస్తున్న ప్రకాష్ రాజ్…తాజాగా మరోసారి తనమనసులోని మాటను బయటపెట్టారు. ఈ ఆపత్కాల పరిస్థితుల్లో పేదలకు అండగా నిలుస్తానని …తనకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడం మాననని తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.
నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే అప్పు తీసుకొని అయినా ఈ కష్టకాలంలో నాకు సాధ్యమైనంత సాయం అందిస్తానని ట్విట్టర్లో పేర్కొన్నారు. భవిష్యత్లో మళ్లీ సంపాదించుకోగలనని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన విపత్కర సమయమిది. మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం. జీవితాలను నిలబెడదాం అని పిలుపునిచ్చారు.
- Advertisement -