Green Challenge:మొక్కలు నాటిన ప్రకాశ్ అంబేద్కర్

69
- Advertisement -

తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బిఆర్.అంబేద్కర్ గారి స్పూర్తిని కొనసాగిస్తున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆశయం గొప్పదన్నారు డా. బిఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాశ్ అంబేద్కర్.

*ఇవ్వాల బేగంపేటలో, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” భాగంగా మొక్కను నాటిన ప్రకాశ్ అంబేద్కర్. “మనుషుల్లో సమానత్వం – ప్రకృతి సమతూల్యత” కోసం పరితపించిన మా తాతగారు డా.బీఆర్. అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.* మా తాతగారు తాను “కేంద్ర న్యాయశాఖ మంత్రి”గా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని కోరుకున్నారు. మొక్కలు నాటడం పట్ల వారికి అమితమైన ఆసక్తి ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్పూర్తిని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో చూస్తున్నాను.

*ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారి గారి కృషి అనితరసాధ్యమైనది. ఈ మధ్యలోనే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లిమ్కాబుక్ లో చేరడం నాకు చాలా ఆనందం కలిగించింది.* వారి కృషికి మరింత గుర్తింపు రావాలి.. ప్రకృతి పచ్చదనంతో పరిఢవిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సంతోష్ కుమార్ గారికి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధి సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -