ప్రజావాణి కార్యక్రమం తుస్సుమందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గవర్నర్ నోట కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు మాట్లాడించిందన్నారు. ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయి… అందులో ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చెయ్యకుండా అబద్దాలు కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేస్తుందన్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదన్నారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయమై ఒక్క మాటా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, గవర్నర్ ప్రతిష్ట దిగజార్చిందన్నారు.బీఆర్‌ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని వెల్లడించారు.
ఆరు గ్యారంటీల్లో 13 హామీలున్నాయని ఎద్దేవా చేసిన హరీష్.. మహాలక్ష్మి పథకంలో మూడు చెప్పి ఒక గ్యారంటీ అమలుచేశామని చెబుతారా అని ప్రశ్నించారు. వంద రోజుల్లో 60 రోజులు పూర్తయ్యాయ, ఇంకా 40 రోజులే ఉన్నాయని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు.
Also Read:TTD:విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి