కాంగ్రెస్ హామీలు ‘రోడ్డుపాలు’ !

33
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలే. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తప్పకుండా అమలు చేస్తామని కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతూ వచ్చింది. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఆరు గ్యారెంటీ హామీలపైనే చేసి అందరి ప్రజలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆల్రెడీ ఆరు గ్యారెంటీ హామీలలో భాగమైన రెండు హామీలను అమల్లోకి తీసుకురాగా మిగిలిన హామీలను మరో వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీ హామీలకు సంబంధించి ఒకే దరఖాస్తును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వడివడిగా హామీల అమలు దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని భావించారంతా..

కానీ ఇంతలోనే ప్రజాపాలన దరఖాస్తులన్ని రోడ్లపై దర్శనమివ్వడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వ్యక్తి ప్రజాపాలన దరఖాస్తులను పట్టుకొని రోడ్డుపై నిలబడి.. అవి గాలికి ఎగిరి పోతున్న బాద్యతరహితంగా వ్యవహరిస్తుండడంతో.. కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన దరఖాస్తులపై నిర్లక్ష్య ధోరణితో ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు సంబంధించి వీడియోను బి‌ఆర్‌ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. బాధ్యతారాహిత్యానికి, అసమర్థ పాలనకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అంటూ రాస్తుకొచ్చింది. ప్రజపాలన దరఖాస్తులను రోడ్డుపాలు చేస్తూ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లకు తాకట్టు పెట్టిందని బి‌ఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ పార్టీ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

https://x.com/BRSparty/status/1744594016426160379?s=20

Also Read:సైంధవ్..వెంకీ ఇమేజ్‌కు తగ్గట్టుగా!

- Advertisement -