- Advertisement -
కంచె సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రగ్యా ఎప్పటికప్పుడూ తన అందచందాలతో అభిమానులను అలరిస్తూనే ఉంది.
తాజాగా యోగాతో మరోసారి కుర్రకారు మతిపొగొట్టింది ప్రగ్యా. మండే మోటివేషన్ అనే పేరుతో తాను యోగ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. తన అందాలు ఆరబోస్తూ చేసిన ఈ యోగాసనాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రగ్యా నటించనున్నట్లు సమాచారం.
- Advertisement -