మరోసారి కంచె దర్శకుడితో ప్రగ్యా..!

359
pragya
- Advertisement -

కంచె సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రగ్యా ఎప్పటికప్పుడూ తన అందచందాలతో అభిమానులను అలరిస్తూనే ఉంది.

క్రిష్ తాజాగా ‘ఉప్పెన’ ఫేం వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రొమాంటిక్ మూవీగా తెరకెక్కే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా మరో హీరోయిన్ కూడా ఉండనుందట.

కంచె సినిమాతో తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన ప్రగ్యా జైస్వాల్‌ని తీసుకోవాలని భావిస్తున్నారట దర్శకుడు క్రిష్‌. సినిమాలో ఇది కీలకమైన పాత్ర అని….ఈ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తీ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ క్రిష్ భావిస్తున్నాడు.

- Advertisement -