ప్రగతి చెట్లకు సోపానం అని ప్రగతి రిసార్ట్ సి.ఎం.డి జి బి కె రావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ప్రొద్దుటూరు గ్రామ శివారులో ఉన్న ప్రగతి రిసార్ట్స్ లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవాళి జీవితానికి చెట్లు ఎంతో అవసరమని ప్రతి ఒక్క జీవి చెట్ల పైన ఆధారపడి ఉందని అన్నారు. సమాజంలో ప్రస్తుతం వస్తున్న మార్పులు చెట్లు తగ్గడం వల్లే అన్నారు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటుకోవాలి అని సూచించారు. రాష్ట్రంలో లో ప్రతి అడుగు నా మొక్కలు నాటి హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి గ్రామాలను పచ్చటి శోభను సంతరించుకుంది విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కాగా ప్రగతి రిసార్ట్స్ లో ఎన్నో వేల రకాల ఔషధ గుణాలు కలిగిన చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ రాజిరెడ్డి, డాక్టర్ నిర్మలా దేవి ,ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలీ డాక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.