పెరుగుతున్న పొల్యూషన్‌ తగ్గించుకోవాలి :ప్రాచీ తక్కర్‌

128
- Advertisement -

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్ని మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను ప్రజలకు విపులంగా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి అమిక్షా పవార్‌ విసిరిన సవాలు స్వీకరించి మొక్కలు నాటిన నటి, మోడల్‌ ప్రాచీ తక్కర్‌.

ఈ సందర్భంగా ప్రాచీ తక్కర్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పెరుగుతున్న పొల్యూషన్ తగ్గాలంటే తప్పకుండా ప్రతీ ఒక్కరు వారికి ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత అన్నారు.

నిరంతరంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అభిలాష్ బండారి, నిహదేశ్ పాండే, రమ్యా దినేష్, కునాల్ కౌశిక్, గౌరేష్ వీరిని ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -