డార్లింగ్‌ కోసం ఆరు వేల సంబంధాలు..!!

446
Prabhas turned down 6000 marriage proposals
Prabhas turned down 6000 marriage proposals
- Advertisement -

బాహుబలి చూసిన ప్రతీ ఒక్కరిని గత రెండేళ్ళుగా ఒకే ఒక్క ప్రశ్న వెంటాడింది… అది వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని… అయితే ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇక ‘ప్రభాస్‌ పెళ్లెప్పుడు’ అన్న ప్రశ్న టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభాస్ పెళ్ళి విషయంపై కొన్ని రోజులుగా అనేక పుకార్లు షికారు చేసాయి. చివరికి బాహుబలి చిత్ర ప్రమోషన్స్ లోను ఈయనకి పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కాని వాటికి తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు ప్రభాస్.

6sfr03_Prabhas Movie Baahubali

అభిమానులని ఆనందపరిచే విషయమేమంటే కుటుంబ సభ్యులు ప్రభాస్ కి సరైన జోడిని ఇప్పటికే వెతికారని, ఈ శుభవార్తని ప్రభాస్ త్వరలోనే తన అభిమానుల చెవిని పడేయనున్నాడనే టాక్ నడుస్తుంది. అయితే ఓ జాతీయ మీడియా సంస్థ వెలువరించిన కథనం చాలా ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే, ప్రభాస్ కు ఇప్పటి దాకా 6వేల మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయట. అయితే తన ఫోకస్ మొత్తం ‘బాహుబలి’ మీదే ఉంచడంతో ఈ ప్రపోజల్స్ ను ప్రభాస్ దూరంగా పెట్టాడట.

prabhas-story_647_012016105845

అంతేకాదు, ఓ సంస్థకు ప్రచారకర్తగా ఉండేందుకు ప్రభాస్ కు రూ. 10 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ ప్రభాస్ తిరస్కరించాడట. బాలీవుడ్ ఆఫర్లు తలుపు తట్టినా ‘బాహుబలి’ కోసం ఆ ఆఫర్లను తిరస్కరించాడని సదరు పత్రిక తెలిపింది. ప్రభాస్ కు ఉన్న అంకిత భావానికి ఇదొక నిదర్శనమని చెప్పింది. ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ఈ సినిమా అయ్యాక చేసుకుంటాడా.. లేక పెళ్లి చేసుకున్నాక ఈ సినిమా షూటింగ్ పాల్గోంటాడా.. అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రభాస్‌ డార్లింగ్స్‌ను వేధిస్తున్నాయి.

- Advertisement -