ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడో తెలుసా…?

175
- Advertisement -

ప్రభాస్ బాహుబలి తర్వాత జాతీయ స్టార్ అయిపోయారు. ఈ క్రమంలో అంత సక్సెస్ పొందిన హీరోపై రూమర్లు పుట్టుకురావడం సహజమే. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్‌ జాబితాలో ఉండే తొలి పేరు ఏదైనా ఉంది అంటే అది ప్రభాసే. అందుకే ప్రభాస్ పెళ్లిపై ఇటీవలి కాలంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అంతేనా తన సహ నటి అనుష్కను త్వరలోనే ప్రభాస్ పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే వాటన్నింటికీ స్పందించని ప్రభాస్ తాజాగా ప్రభాస్ తొలిసారి పెదవి విప్పారు. ఇప్పట్లో పెళ్లి లేదని, అనుష్కతో అఫైర్ కూడా అవాస్తవమని తేల్చిచెప్పేశాడు ప్రభాస్‌.

Prabhas Talks About His Wedding

అంతే కాదు ఒక హీరోయిన్‌తో వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్లు రావడం సహజమేనని ప్రభాస్ తెలిపాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా హల్ చల్ చేసే ఇలాంటి పుకార్లు మొదట్లో తనకి ఇబ్బంది కలిగించేవనీ ఆ తరువాత వాటిని గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పాడు. ఇక తన ఇంట్లో పెళ్లికి సంబంధించిన ముచ్చట్లు జోరందుకున్నాయనీ త్వరలోనే పెళ్లి జరగవచ్చనే వార్తల్లోనూ నిజం లేదని కుండబద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం తన దృష్టి ‘సాహో’ సినిమాపైనే ఉందనీ ఇలాంటి యాక్షన్ సినిమాలో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ప్రభాస్ చెప్పారు. ఆ సినిమా పూర్తయిన తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -