ప్రభాస్‌ ఆ విషయంలో భయపడుతున్నాడు

212
- Advertisement -

రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి. ప్రపంచ రికార్డులు సాధించిన ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరింత పెంచింది. బాహుబలి 1లో గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజమౌళి కట్టప్పతో ‘బాహుబలి’ని చంపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.

‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా?’ అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఆడియెన్స్‌ బాహుబలి2 కన్‌క్లూజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
 prabhas talk about bahubali2
ఇదిలా ఉంటే..’బాహుబలి 2′ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్ల కాలాన్ని కేటాయించడం తనకి హ్యాపీగానే అనిపిస్తోందని చెప్పాడు. అంతేకాకుండా బాహుబలికి కేటాయించిన ఈ సమయంలో తాను 8 సినిమాల వరకూ చేసేవాడని అన్నాడు ప్రభాస్‌. అయితే 16 సినిమాలు తీసుకొచ్చే క్రేజ్ తనకి ఈ ఒక్క సినిమా తీసుకొచ్చిందని చెప్పాడు.
 prabhas talk about bahubali2
బాహుబలి సినిమా విషయంలో ఎంతో క్రమశిక్షణగా.. బాధ్యతగా ఈ సినిమా షూటింగును పూర్తి చేశామని అన్నాడు. ఈ సినిమా బడ్జెట్ పరిధి దాటిపోతుందేమోననే టెన్షన్ వుండేదనీ, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మానసికంగా.. శారీరకంగా చాలా శ్రమించేవాళ్లమని చెప్పాడు ప్రభాస్‌. ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో కూడా టెన్షన్ గానే అనిపిస్తోందని అన్నాడు.

- Advertisement -