అభిమాని కోరిక తీర్చిన ప్రభాస్‌..

224
Prabhas
- Advertisement -

టాలీవుడ్‌ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమాని అయిన మదన్ కోరిక తీర్చాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మదన్ అనే బాలుడు తన ఫేవరెట్ హీరో ప్రభాస్‌ను కలవాలని ఆశపడ్డాడు. సోషల్ మీడియా ద్వారా మదన్ చేసిన రిక్వెస్ట్‌పై యంగ్ రెబల్ స్టార్ వెంటనే స్పందించారు. ఆ చిన్నారి కోరికను తీర్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇలా చేయటం చూసాం. ఇప్పుడు సాహో ప్రభాస్ ఈ బాధ్యతను తీసుకున్నాడు.

Prabhas

చిన్నారి అభిమానితో కలిసిన ప్రభాస్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా బాహుబలి స్టార్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐ వాంట్ టు మీట్ ప్రభాస్ అంటూ సోషల్ మీడియా ద్వారా సదరు బాలుడు చేసిన రిక్వెస్ట్‌ను ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ రొమేనియాలో ప్లాన్ చేశారు.

- Advertisement -