- Advertisement -
టాలీవుడ్ టాప్ కమెడీయన్లలో ఒకరు ప్రభాస్ శ్రీను. సినిమాల్లోకి రాకముందు నుండే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..శ్రీనుకు మంచి మిత్రుడు. దీంతో ఎక్కువ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీను…ప్రభాస్ తనను దూరం పెట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇవన్నీ పనిలేని వాళ్లు సృష్టించే పుకార్లు అని తేలచ్చిచెప్పారు.
అప్పుడు .. ఇప్పుడు అనే కాదు ప్రభాస్ ఎప్పటికీ మారడని తెలిపారు. ఇక తన కెరీర్ను గాడిలో పెట్టింది బ్రహ్మానందం అని ఇప్పటికి ఆయన మాటలనే అనుసరిస్తున్నాను అని చెప్పారు.
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ, నాతో అంతే చనువుతో ఉంటాడు. స్టార్ డమ్ ను బట్టి మారాలనే విషయం ఆయనకు తెలియదన్నారు.
- Advertisement -