ప్రభాస్ షర్ట్‌ ధర ఎంతంటే..?

52
- Advertisement -

బాహుబలితో ప్రపంచంను తనవైపుకు తిప్పుకున్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్. అన్‌స్టాపబుల్‌2లో రాబోతున్నారు. ఈ టాక్ షోలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను గెస్టులుగా పిలుస్తూ వారితో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఈ టాక్ షో నిర్వహకులు దీనికి సంబంధించిన 5వ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‍‌కు రెడీ చేశారు. ప్రభాస్ గోపిచంద్‌ ఇద్దరు కూడా ఈ షోలో పాల్గొంటున్నారు.

బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న ఈ షో లో గోపిచంద్‌, ప్రభాస్ కనువిందు చేయనున్నారని ఆహా టీం ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ ఫోటోల్లో, ప్రోమో గ్లింప్స్‌లో ప్రభాస్ మల్టీకలర్ షర్ట్‌లో మెరిసిపోతున్నాడు. ఆయన ఎంట్రీ సినిమా ఈవెంట్‌కు ఏమాత్రం తీసిపోకుండా గ్రాండ్‌గా ప్లాన్ చేసింది ఆహా. అయితే తాజాగా ప్రభాస్ వేసుకున్న షర్ట్‌ మీద టాలీవుడ్‌లో గుసగుసలు మొదలైనాయి. ఈ షో కోసం ప్రభాస్ ఓ మల్టీకలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు.

ప్రభాస్ వేసుకున్న ఈ షర్ట్ ప్రముఖ బ్రాండ్ రాల్ఫ్ లారెన్‌కు చెందిందని.. దీని ధర ఏకంగా రూ.11 వేలు ఉంటుందని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారగా, ఈ ఎపిసోడ్‌ను డిసెంబర్ 31న న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. మరి నిజంగానే అప్పటివరకు ఈ ఎపిసోడ్‌ను హోల్డ్‌లో పెడతారా లేక, అంతకు ముందే స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఒక్క హిట్ట్…రెమ్యునరేషన్ పెంచిన హీరో

చరణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడట

టాప్ టెన్‌ ఐఎండీబీ మూవీస్‌…

- Advertisement -