బాహుబలి సినిమాతో ఒక్క సారిగా నేషనల్ స్టార్ స్థాయిని అందుకున్న ప్రభాస్ కు ఇప్పుడు టాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ ఉంది. టాలీవుడ్‌తోపాటూ..బాలీవుడ్ లోనూ ఇప్పుడిప్పుడే ప్రభాస్ మీద ఆసక్తి పెరుగుతోంది. అయితే ప్రభాస్‌కి ఈ మధ్యే ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది.
ఒక వేళ ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? నిజానికి ప్రభాస్ కెరీర్ నటన వైపు రాకుంటే ఏం చేసేవాడు..? అనే ప్రభాస్ కి ఎదురైంది. దానికి ఈ డాళింగ్ స్టార్ చెప్పిన ఆన్సరేంటో తెలుసా?? “నేను సోమరిపోతును కాబట్టి ఉద్యోగాలు చేయలేను. అందుకని ఏదో ఒక వ్యాపారం చేద్దామనుకున్నా. మా కుటుంబానికి ఆహారం అంటే ఇష్టం కాబట్టి బహుశా హోటల్ బిజినెస్‌లోకి వెళ్లుండేవాణ్ణి. పైగా హైదరాబాద్‌లో ఉత్తరాది తిండికి మంచి గిరాకీ” అని చెప్పాడు.
మరి అసలు నటన విపు రావటానికి ఇంట్రస్ట్ ఎలా మొదలయ్యిందన్న ప్రశ్నకి కూడా సమాధానం ఇస్తూ “ఒక రోజు బాపుగారి దర్శకత్వంలో మా పెదనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా చూస్తుంటే, ఆ కేరక్టర్‌లో నన్ను ఊహించుకున్నా. మేబీ అప్పట్నించే యాక్టింగ్ వైపు రావలనే కోరిక మొదలయ్యిందేమో” అంటూ పెదనాన్నే తన ఇన్స్పిరేషన్ అని చెప్పేసాడు. అయితే నటుడు కావడం తనవల్ల అవుతుందా అనికూడా అనుకున్న సంధర్భాలున్నాయట.
“పెదనాన్న నటుడు, నాన్న నిర్మాత. ఈ ఇద్దరూ ‘నటన మీద నీకు ఆసక్తి ఉందా?’.. అని అడిగారు కూడా . ” అయితే లైట్ల మధ్య అనేకమంది మనుషులు చుట్టూ చూస్తుండగా భావాలు పలికిస్తూ ఎవరైనా ఎలా నటిస్తారు? అనుకునే వాన్ని. అందుకే చెప్పడానికి సిగ్గుపడ్డా.
ఒకటికి రెండు సార్లు అమ్మానాన్నలు ఈ విషయం అడిగితే నటించటం నా వల్ల కాదని చెప్పాను కూడా . కానీ చివరకు అనుకోకుండా ‘ఈశ్వర్’ ఆఫర్ రావటం, చేయాలన్న ఆసక్తి కూడా అప్పటికి పెరిగిపోటం తో అలా కెమెరా ముందుకు వచ్చాను” అని చెప్పాడు ప్రభాస్. పదిహేనేళ్ల కెరీర్ తర్వాత ‘బాహుబలి’ సినిమాలతో వచ్చిన అమితమైన స్టార్‌డమ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు అర్థం కావట్లేదనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం‘సాహో’ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్..ఎక్కువగా బయటకి రాడని టాక్. దీనిపై కూడా రియాక్ట్ అయ్యాడు ప్రభాస్. “తమ హీరో ఎక్కువగా బయటకు రాడని నా అభిమానులు బ్యాడ్‌గా ఫీలవుతుంటారు. ఈ విషయంలో ఇదివరకటి కంటే ఇప్పుడు కాస్త బెటర్ అయ్యాను. ఇంకా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నా” అంటూ చెప్పాడు.