6వ స్ధానంలో సాహో..

416
sahoo
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడంతో ఈసినిమాకు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 30న విడుదలైన ఈమూవీ తెలుగులో మాత్రం అంచానాలను అందుకోలేకపోయింది.

కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించినా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులను సాహో మెప్పించకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఈమూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ 150 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషం. ఇక బీహార్ లోను ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

బీహర్ రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో సాహో 6వ స్ధానంలో నిలిచింది. గతంలో బీహార్లో సందడి చేసిన ‘బజరంగీ భాయ్ జాన్’ .. ‘సుల్తాన్’ .. అమీర్ ఖాన్ ‘పీకే’ .. రణవీర్ సింగ్ ‘సింబా’ చిత్రాల వసూళ్లను దాటుకుని ‘సాహో’ 6వ స్థానాన్ని దక్కించుకుంది. తెలుగు అంతగా ఆకట్టుకోలేకపోయినా ఇతర భాషల్లో మాత్రం సాహో మేనియా బాగానే ఉందని చెప్పాలి.

- Advertisement -