రెబల్ స్టార్ ప్రభాస్ ఈ హీరో నాలుగు పదుల వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోకుండా.. టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో టాప్‌లో ఉన్నారు.. టాలీవుడ్‌లో ప్రతిఒక్కరి నోట వినిపించే ప్రశ్న ఏంటంటే.. ప్రభాస్ పెళ్లెప్పుడు అనే.. ఎందుకంటే మనోడి వయసు నాలుగు పదుల్లో ఉంది మరి. ఇప్పుడు కాదు.. గత కొన్నేళ్లుగానే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ చర్చల్లో నిలుస్తూ వస్తోంది.
అంతేకాదు ప్రభాస్ పెళ్లి, ఆయన చేసుకోబోయే అమ్మాయి అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఎప్పుడు మీడియా ముందుకు ఎదురుపడినా రిపోర్ట్స్ అడికే ప్రశ్న.. ఒక్కటే ‘సార్ మీ పెళ్లి ఎప్పుడు?’ అని.. దీంతో ప్రభాస్ కొన్నిసార్లు సమాధానం ఇస్తారు.. మరికొన్ని సార్లు ఇబ్బందిగా ఫీలౌతారు. అయినా వారు మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటారు. తాజాగా ప్రభాస్‌కు పెళ్లిపై ప్రశ్న మరోసారి ఎదురైంది.
ఇటీవల ఓ మీడియా సంస్థతో ప్రభాస్ మాట్లాడిన సందర్భంగా పెళ్లి టాపిక్ వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్లినా పెళ్లిపై ప్రశ్నిస్తుంటారు. దీన్ని పట్టించుకుంటారా? అని అడగ్గా.. లేదని ఆయన బదులిచ్చారు. నా వివాహం గురించి అడిగినప్పుడు నాకేమీ చిరాకు అనిపించదు. ఇది సాధారణ ప్రశ్నే. మీ స్థానంలో నేను ఉన్నా దీనిపై నాకు ఆసక్తి ఉంటుంది అని చెప్పారు. మరి త్వరలో వివాహం చేసుకోబోతున్నారా? అని అడగ్గా ప్రశ్నకు.. ‘‘దీనికి సమాధానం నా వద్ద ఉన్నప్పుడు తప్పకుండా ప్రకటిస్తా అంటూ ప్రభాస్ పెద్దగా నవ్వేశారు. అంటే ఇప్పట్లో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి లేనట్లే.