ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్..

700
sahoo prabhas
- Advertisement -

ఫ్యాన్స్‌కు మరో సర్‌ ప్రైజ్ ఇచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకోగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటివరకు రొమాంటిక్‌,థ్రిల్లర్‌,టీజర్‌,ట్రైలర్‌లను విడుదల చేస్తూ వచ్చిన చిత్రయూనిట్‌ తాజాగా మరో ట్రీట్ ఇచ్చింది.

ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు ప్రభాస్‌. ఇందులో బాక్సింగ్‌ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో దర్శకుడు సుజీత్‌ సూచనలు ఇస్తుండగా, ప్రభాస్‌ శ్రద్ధగా వింటూ కనిపించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న సాహోతో ప్రభాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

https://www.facebook.com/watch/?v=529710660900471

- Advertisement -