యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. చివరగా వీరిద్దరు కలిసి బాహుబలి సినిమాలో నటించారు. కాగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ చాలా సార్లు మీడియాలో వచ్చిన సంగతి తెలిసింది. ఏకంగా వారిద్దరూ వచ్చి మీడియా ముందు చెప్పినా పుకార్లకు మాత్రం బ్రేక్ పడట్లేదు. వీరిద్దరికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనుష్క కోసం ప్రభాస్ అమెరికాలో ఇళ్లు చూస్తున్నాడని..ఇద్దరు కలిసి ఇళ్లు కోసం వెతుకుతున్నారని ఓ పత్రిక రాసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ప్రభాస్ ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈసందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మళ్ళీ అదే ప్రశ్నలు అడుగుతున్నారు.
ఈ వార్తలపై ప్రభాస్ స్పందిస్తూ.. ఈ వదంతులకు ఫుల్స్టాప్ పడాలంటే అనుష్క అయినా త్వరగా పెళ్లిచేసుకోవాలి. లేదా నేనన్నా ఓ ఇంటివాడిని అవ్వాలి. ఈసారి అనుష్కను కలిస్తే త్వరగా ఎవర్నో ఒకరిని చూసుకుని పెళ్లిచేసుకోమని చెబుతాను. అప్పుడే మా ఇద్దరి మధ్య ఇలాంటి వదంతులు రాకుండా ఉంటాయి. ఒక వేళ మేమిద్దరం రిలేషన్ షిప్ లో ఉంటే నిజం దాచాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదని చెప్పారు.