Prabhas:రాజా సాబ్..స్పెషల్ పోస్టర్

4
- Advertisement -

భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం నేటికి 23 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ బిగిన్ అయ్యింది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ప్రభాస్ రెండు సార్లు(బాహుబలి 2, కల్కి 2898 ఎడి) వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక రేర్ రికార్డ్.

వెండితెరపై ప్రభాస్ ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆయన కొత్త సినిమా “రాజా సాబ్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సరికొత్త మేకోవర్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ కెరీర్ లో మరో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న “రాజా సాబ్” సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read;ఆస్పత్రిలో చేరిన నటుడు గోవిందా

- Advertisement -