త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌..!

816
prabhas
- Advertisement -

గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయనున్నాడని ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఎన్టీఆర్ వున్నాడు.

ఈ విషయాన్ని గురించి త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మాట్లాడటం ఆయన సుముఖాన్ని వ్యక్తం చేయడం జరిగిపోయిందట. ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ వచ్చే ఫిబ్రవరికి కంప్లీట్ కానుంది.

ntr

ఈ సినిమాకి ‘హారిక అండ్ హాసిని’ చినబాబు .. కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వుండనున్నారని అంటున్నారు. హారిక హాసిని వారు గీతా ఆర్ట్స్ తో కలిసి ‘అల వైకుంఠపురములో’ చేసినట్టుగానే, కల్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న మాట. ఇక త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ప్రభాస్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్, ప్రభాస్‌తో ఎవరితో ముందుకు వెళ్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -