బాహుబలి కోసం నాలుగేళ్లకు పైగా సమయం కేటాయించిన ప్రభాస్ ఎట్టకేలకు ఆ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. బాహుబలి-2 విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బాహుబలి2 సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ అమెరికాలో కొన్ని రోజులు ఉన్నాడు. చాలాకాలం తర్వాత తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సుదీర్ఘకాలం గడిపిన ప్రభాస్.. ఇప్పుడు యూఎస్ టూర్ ఫినిష్ చేసుకుని ఇండియా తిరిగి వచ్చేశాడు.
ఇక ఇదిలా ఉంటే..బాహుబలి తర్వాత ప్రభాస్ సుజీత్ డైరెక్షన్‌లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి, సాహో కోసం ప్రభాస్ ఎలా తయారయ్యాడు..? కండలు తిరిగిన బాడీతో బాహుబలిలో కనిపించిన ప్రభాస్.. తన తర్వాతి సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి ప్రభాస్ కనిపించగా.. యంగ్ రెబల్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేస్తున్నాడు. ఇదే సాహోలుక్ అనుకున్నారు చాలామంది. ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ లుక్‌లో క్లీన్ షేవ్ తో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. సడెన్ గా ఆ పిక్ చూస్తే ఇది ప్రభాసేనా అని అనుమానం రాకపోదు. అయితే ప్రభాస్ సడెన్ గా ఇలా కంప్లీట్ మేకోవర్ మార్చుకోవడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. సాహో చిత్రం 150 కోట్ల బడ్జెట్ తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది.