ప్రభాస్ తన ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్‌ను ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అభిమానులు నిరుత్సాహం కూడా వ్యక్తం చేశారు. అయినా, ప్రభాస్ మాత్రం చాలా సాధారణ దుస్తులలోనే చాలా సింపుల్ గా ఇన్నాళ్లు కనిపిస్తూ వచ్చాడు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ మాత్రం అదిరిపోయింది. మొత్తానికి ప్రభాస్ తన ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్ ను మరియు తన ప్రెజెంటేషన్ ను పూర్తిగా మార్చేశాడు. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ప్రభాస్ తెల్లటి చొక్కా.. అలాగే షర్టు లోపల కూడా వైట్ టీ-షర్టును ధరించి, తెల్లటి షూస్ తో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
Also Read:ఆర్ఎస్‌ఎస్‌తో దేశానికి పెను ముప్పు?
దీంతో ఈ లుక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ అభిమానులు ఈ కొత్త లుక్‌తో ప్రేమలో పడిపోయారు. తమ హీరోని ఇకపై స్క్రీన్‌పై కూడా ఇలాంటి లుక్ లోనే చూడాలని వారు పోస్ట్ లు పెడుతున్నారు. ఇంతకీ ప్రభాస్ ఏ సినిమా కోసం ఈ లుక్ లోకి మారాడో తెలుసా ?. ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ ఈ లుక్ లో కనిపిస్తాడట. మారుతి చిన్న దర్శకుడు కావడంతో ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా అనుమానం ఉంది.
Also Read:Chalapathi Rao:ఇండస్ట్రీలో చెరగని ముద్ర
అవుట్ ఫుట్ ఎలా వస్తోందో ?.. అసలు నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ ను మారుతి హ్యాండిల్ చేయగలడా ? లేదా ? అని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం దైర్యంగా ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. అసలు ప్రభాస్ ఏ నమ్మకంతో ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడో ప్రభాస్ కే తెలియాలి. ఏది ఏమైనా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మాత్రం బాగుంది.
Darling Unseen #Prabhas pic.twitter.com/cqPfks6Q6W
— Prasad Bhimanadham (@Prasad_Darling) May 7, 2023