- Advertisement -
సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. ప్రస్తుతం రామగుండంలో సినిమా షూటింగ్ జరుగుతుండగా బొగ్గు గని ప్రాంతంలో ఫైట్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సీపీ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు ప్రభాస్.
సీపీ కార్యాలయానికి ప్రభాస్ రావడంతో ఆయన్ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పదిరోజుల పాటు ఓపెన్ కాస్ట్ గనిలో షూటింగ్ జరగనుండగా చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన సలార్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాస్.
- Advertisement -