బాహుబలి చూసిన ప్రతీ ఒక్కరిని గత రెండేళ్ళుగా ఒకే ఒక్క ప్రశ్న వెంటాడింది… వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ? అని. అయితే ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇక ఇప్పుడు‘ప్రభాస్ పెళ్లెప్పుడు’ అన్న ప్రశ్న టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభాస్ పెళ్ళి విషయంపై కొన్ని రోజులుగా అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి.
చివరికి బాహుబలి చిత్ర ప్రమోషన్స్ లోనూ ఈయనకి పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కాని వాటికి తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు ప్రభాస్.
అయితే ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే న్యూస్ బయటకొచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే..కుటుంబ సభ్యులు ప్రభాస్ కి సరైన జోడిని ఇప్పటికే వెతికారని, ఈ శుభవార్తని ప్రభాస్ త్వరలోనే తన అభిమానులతో పంచుకోనున్నాడని టాక్. ఇదిలా ఉంటే..ఇప్పటికే ఓ జాతీయ మీడియా సంస్థ వెలువరించిన కథనంలో ప్రభాస్ కు ఇప్పటి దాకా 6వేల మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయని, అయితే తన ఫోకస్ మొత్తం ‘బాహుబలి’ మీదే ఉంచడంతో ఈ ప్రపోజల్స్ ను ప్రభాస్ దూరంగా పెట్టినట్లు వచ్చిన వార్తలు కూడా తెలిసిందే.
అయితే ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళి గురించి ఇంకా టాక్ నడుస్తూనే ఉంది. కొందరైతే అనుష్కను ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడని అంటుంటే, కాదు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దింటి సంబంధాన్ని చూస్తున్నాడని కొందరు అంటున్నారు.
సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్ళి గురించి ఇప్పుడు కొత్త గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ రాశి సిమెంట్స్ అధినేత మనవరాలితో ప్రభాస్ పెళ్ళి జరుగుతుందని, ప్రస్తుతం పెద్దల మధ్య మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆయితే అమ్మాయి పేరు ఏమిటి అనే విషయం మాత్రం బయటకు రాలేదు.
అంతే కాదు…. వచ్చే నవంబర్లో ప్రభాస్ పెళ్లి జరుగబోతోందని, ఈ విషయాలన్నీ బయటకు తెలియకుండా చకచక పనులు జరిగిపోతున్నాయని అంటున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇలా రకరకాల ప్రచారం జరుగుతుండటంతో ఏది నిజయో? ఏది రూమరో? అర్థం కాక ఫ్యాన్స్ అయోమయంలో పడుతున్నారు.