అక్టోబర్‌లో ప్రభాస్ పెళ్లిపై ప్రకటన..!

245
Prabhas marriage
- Advertisement -

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ అనగానే గుర్తొచ్చే పేరు రెబల్‌ స్టార్‌ ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్‌ పెళ్లి విషయం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ బాహుబలి పెళ్లి ప్రకటన కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల కోరిక ప్రభాస్ ఈ బర్త్ డే సందర్భంగా తీరబోతోందట. అక్టోబర్ 23న ప్రభాస్‌ బర్త్ డే.ఈ సందర్భంగా ఆయన పెళ్లికి సంబంధించిన కీలక ప్రకటనను ఆయన కుటుంబ సభ్యులు వెలువరించనున్నారని సమాచారం.ఈ బర్త్ డేతో 38వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు ప్రభాస్.

Prabhas marriage

గతంలో ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఇద్దరు స్టార్స్ ఖండించారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అంతకు మించి మరే రిలేషన్ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభాస్… యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటించనుంది.

- Advertisement -