మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా మహేష్‌-ప్రభాస్‌..!

408
- Advertisement -

బాహుబలి స్టార్‌ ప్రభాస్,సూపర్‌స్టార్‌ మహేష్‌ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన పనికి ఫిదా అయ్యారు. కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు ఈ హీరోలు. డెంగ్యూ, విష జ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని కోరిన ప్రభాస్, మహేష్‌.. అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కేటీఆర్ బాటలో నడిచి.. అందరూ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా వారు తెలిపారు.

సీజనల్ వ్యాధుల పైన వైద్య శాఖ మంత్రి కేటీఆర్‌.. వైద్య శాఖ అధికారులు, పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సొంత ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ డ్రైవ్‌లో ప్రజలను చైతన్యవంతం చేసి పారిశుద్ద్యం నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు తమ సొంత ఇళ్ళలోని పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

ktr

ప్రతి ఒక్కరూ తమ సొంత ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టి సారించి ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలన్నారు కేటీఆర్‌. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుద్యం అత్యంత కీలకమైన అంశం అని అన్నారు. ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన మందును చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని వస్తువులను తొలగించుకోవాలని కోరారు.

ముఖ్యంగా దోమల వృద్ధికి అవకాశం ఉన్న నీటి తొట్లు, మరియు నీటి నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. దోమల వ్యాప్తికి ఇదే కారణమని కేటీఆర్ తెలిపారు. అందుకే తన ఇంటి పరిసరాలను తానే స్వయంగా శుభ్రం చేసినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆ ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు. మీరు కూడా ఇంటి పరిసరాలను క్లీన్ చేసి ఆ ఫొటోలను తనతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆ ట్వీట్‌పై స్పందించిన ప్రభాస్,మహేష్‌.. కేటీఆర్ చేసిన పనిని మెచ్చుకున్నారు. వీరి మద్దతుకు మంత్రి కేటీఆర్ దన్యవాదాలు తెలిపారు.

- Advertisement -