Prabhas:కల్కి..ట్రైలర్ డేట్ లాక్

5
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏ.డి . పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. పురాణాల ఆధారంగా చరిత్రను చూపిస్తూ అలాగే ఫ్యూచర్ లో ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై సైంటిఫిక్ డ్రామా గా మూవీని రూపొందిస్తున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. జూన్ 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ కట్ ని ఈ జూన్ 10న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు.

ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. దీపికా, దిశా పటాని,అమితాబ్,కమల్ హాసన్ కీలక పాత్ర పోషించగా రూ.600 కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ నిర్మించింది.

Also Read:Pawan:అందుకే జీతం తీసుకుంటా

- Advertisement -