కల్కి..ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

17
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ జూన్ 27, 2024న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ తో సహా దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని సమాచారం. మే 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

Also Read:మరో సినీ జంట బ్రేకప్!

- Advertisement -