విష్ణు డ్రీమ్ ప్రాజెక్టులో ప్రభాస్!

19
- Advertisement -

మంచు విష్ణు ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ రూమర్ టీ టౌన్‌లో వినిపిస్తోంది. ఆదిపురుష్ ప్రభాస్ ఈసినిమాలో నటిస్తున్నారట. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

కృతి సనాన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో సినిమా విడుదల కానుంది.

Also Read:Gold Price:స్వల్ప ఊరట

- Advertisement -