దర్శకుడికి ఫ్యాన్స్ వార్నింగ్

19
- Advertisement -

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఓంరౌత్‌ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ 16న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఓం రౌత్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. పైగా ‘ఆదిపురుష్‌’‌ను సాధ్యమైనన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మరి సీజీ వర్క్ క్వాలిటీ మాటేమిటి ?. నిజానికి ‘ఆదిపురుష్’ మూవీ టీజర్ రిలీజ్ కాగానే ఈ టీజర్ పై బాగా నెగిటివ్ టాక్ వచ్చింది.

ఈ టీజర్ లో దర్శకుడు ఓంరౌత్‌ వానరులను అడవిలో ఉండే జంతువుల వలే చూపించాడని, అలాగే రావణాసురుని ముస్లింలా, రాముని ఆహార్యాన్ని కూడా వివాదాస్పదంగా చూపించాడు అని కామెంట్స్ వచ్చాయి. పైగా దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా టీజర్ పై హిందూ సంఘాల నుంచీ నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి. దాంతో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పై మరలా వంద కోట్లు అదనంగా ఖర్చుపెట్టి మరీ వర్క్ చేయించారు.

ముఖ్యంగా ఆదిపురుష్ లోని మెయిన్ క్యారెక్టర్స్ యొక్క అప్పియరెన్స్ ను కూడా కొంత మార్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ, ఆ మార్పు ఎలా జరిగింది ?, ఓం రౌత్ పై ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ లో నమ్మకం పోయింది. కాబట్టి.. అతని పనితనాన్ని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాని జూన్ 16న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఓం రౌత్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఓం రౌత్ సీరియస్ అవుతున్నారు. సినిమా బాగాలేకపోతే అంతు చూస్తాం అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -