- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదంపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ నెల 11న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సంర్భంగా ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ప్రభాస్ ఈ వివాదంపై స్పందించాడు.
రాధేశ్యామ్ విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచితే చాలా సంతోషిస్తానన్నాడు ప్రభాస్. మరోవైపు సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు సినిమా టికెట్ల జీవో జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాస్ కామెంట్లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
- Advertisement -