పిక్చర్ పర్ఫెక్ట్ : సైరాతో సాహో

730
chiru
- Advertisement -

మెగా,యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే ఫోటో ఇది. మెగాస్టార్ చిరంజీవి,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కలిసి ఫోటో దిగడం పక్కనే రామ్ చరణ్ ఉండటం ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

అక్టోబర్‌లో చిరు నటించిన సైరా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబైలో సైరా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ మెగా ఈవెంట్‌కి అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన బిగ్ స్టార్స్ పాల్గొన్నారు.

ఇందులో భాగంగా చిరు,రామ్‌ చరణ్‌తో కలిసి ప్రభాస్ ఫోటోకి ఫోజు ఇచ్చి కోట్లాది మంచి ప్రేక్షకులకు కనువిందు చేశారు. అటు సాహో.. ఇటు సైరా ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.గతంలో ఖైదీ నెంబర్ 150 సినిమా షూటింగ్ సమయంలో చిరు-ప్రభాస్ కలిసి పోటో దిగిన సంగతి తెలిసిందే.

Image result for chiranjeevi prabhas

ప్రభాస్ నటించిన సాహో ఈనెల 30 ప్రేక్షకుల ముందుకు రానుండగా సైరా గాంధీ జయంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత విస్తరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -