- Advertisement -
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.
తాజాగా ఆదిపురుష్ విడుదల తేదీని ట్విట్టర్ వేదికగా నిర్మాతలు ప్రకటించారు. ఈ పాన్ ఇండియా సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతోంది. ప్రభాస్ తన కెరియర్లో మొట్టమొదటి సారిగా ఒక పౌరాణిక చిత్రం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టి – సిరీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
- Advertisement -