ప్రభాస్‌ 20 కి రిలీజ్‌ డేట్ ఫిక్స్..!

563
Prabhas
- Advertisement -

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తాజా చిత్రం రూపొందుతున్నా విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ వార్త వినిపిస్తోంది.

Prabhas 20 movie

ఈ సినిమాను దసరా సీజన్‌లో విడుదల చేయాలని నిర్ణయానికి దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 16ను విడుదల తేదీగా లాక్ చేశారట. రెగ్యులర్ బయ్యర్లకు కూడా ఈ సమాచారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ తేదీని ప్రకటించనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -