ఇటీవల మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మళ్లీ దూరం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సమయంలో అన్నదమ్ములిద్దరు పలు సార్లు మీడియా ముఖంగానే కలిసి, కనిపించారు. మూవీ ఆడియో వేడుకకు చిరంజీవి వెళ్లాడు. అయితే మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ, పవన్.. మెగా కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ధృవ సినిమా కోసం, ఆ తరువాత ఇప్పుడు అన్నయ్య చిరు మూవీకోసం పవన్ కదిలొస్తాడని అనుకున్న మెగా హీరోలకు భంగపాటు తప్పలేదు. పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. మెగాఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా నిరాశగా ఉన్నారు. అయితే గతనెల 17వ తేదిన మెగాబ్రదర్స్ ఇద్దరు కలిసారని తాజా సమాచారం. పవన్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో చిరంజీవి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముందే తమ్ముడ్ని వెనకేసుకొచ్చారు.
పవన్ తన కాటమరాయుడు షూటింగ్‌లో బిజీగా ఉన్నా ఖైదీ ఫంక్షన్‌కు రావడానికి పవన్ అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడని, కానీ, వాస్తవాలు తెలియక మీడియా ఎదో ఊహించుకుని రాస్తూ.. ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక గత నెల డిసెంబర్ 17న తమ తండ్రి ఆబ్దీకానికి పవన్ అన్నయ్య ఇంటికి వెళ్లాడట. ఆ రోజు ఒక పూటంతా పూర్తిగా ఉన్న విషయం ఎంత మందికి తెలుసు అంటూ చిరంజీవి ఎదురు ప్రశ్నవేశాడు.