- Advertisement -
విద్యుత్ సంస్థ సిఎండిలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. నిన్న విద్యుత్ సౌధలో ధర్నాకు దిగిన ఉద్యోగులు ఇవాళ….విద్యుత్ సాధ నుంచి మింట్ కాంపౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఓటు కు నోటు దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 70 వేల మంది ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే తమ తదుపరి నిరసన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విద్యుత్ యాజమాన్యాలను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
- Advertisement -