ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేయండి..

178
- Advertisement -

ప్రగతి భవన్లో విద్యుత్ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని ఓ పెద్ద మనిషి కర్ర పట్టుకొని చూపించిండు.. విద్యుత్ రంగంలో అద్బుతమైన విజయం సాధించినం.. విద్యుత్‌ శాఖలోని 24 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం.. 13500 ఖాళీలు భర్తీ చేస్తే 10 వేల మందికి ప్రమోషన్ వస్తయని ఉద్యోగులు చెప్పిన్రు.. రాబోయే నెలన్నరలో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేయండి. అప్పుడు ఏ పోస్టు తేలిందో ఆ పోస్ట్కు నోటిఫికేషన్ ఇవ్వండి. త్వరలో 75 వేలమంది ఉద్యోగులతో దేశంలోనే తెలంగాణది అతిపెద్ద విద్యుత్ సంస్థ అయితది..

ఆరు నెలల్లోనే కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించేలా టీఎస్‌ ఐపాస్ అనుమతులిస్తున్నాం. సోలార్‌తో కలుపుకొని 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి త్వరలో చేరుకుంటాం.. అన్ని ప్రాజెక్టులకు అవసరమైన కరెంట్ అందించడం కోసం విద్యుత్ శాఖ సిద్దంగా ఉండాలి. కోటి ఎకరాలకు నీళ్లివ్వడం కళ్లారా చూడాలి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. మనమంతా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మా లైన్ మెన్ అన్నదమ్ములు.. జూనియర్ ఇంజనీర్ల సహకారం వల్లనే సాధ్యమైందన్నారు సీఎం.

- Advertisement -