TTD: పౌర్ణమి గరుడ సేవ

5
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఇవాళ పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.

అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్నారు శ్రీ పద్మావతీ అమ్మవారు.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో … అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. అక్టోబర్ 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీ సూర్యనారాయణ స్వామి.

Also Read:BB9: నామినేషన్స్ నుంచి ఇమ్మూ సేఫ్

- Advertisement -