గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఫ్రెష్ నెస్ , హానెస్టీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి.యువ చంద్ర కృష్ణ హీరోగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్ గ్రామీణ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం . ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి
తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ తో వచ్చారు. పొట్టేల్ పవర్ ఫుల్ టీజర్ ఈనెల 18న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక.శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.
Also Read:KCR:రంజిత్ రెడ్డికి బుద్ది చెప్పండి