బినామీ పేర్లతో ఆస్తులు కొన్న పవన్!

20
- Advertisement -

బినామీ పేర్లతో జనసేన అధినేత పవన్ ఆస్తులు కొన్నారని ఆరోపించారు వైసీపీ నేత పోతిన మహేశ్. మీడియాతో మాట్లాడిన ఆయన పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారని పేర్కొన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు ను కలిసి వచ్చాక పవన్‌లో చాలా మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని అనేక ఆస్తులు కొనుగోళ్లు చేశారన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు.

నాదెండ్ల మనోహర్‌కు రూ. 10 కోట్ల స్పోర్స్ట్‌ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు పల్లకి మోయడమే పవన్‌ కల్యాణ్‌ లక్ష్యమని ఎద్దేవా చేశారు.

Also Read:ఆవాల నూనెతో ప్రయోజనాలు!

- Advertisement -