మొలకెత్తిన ఆలుగడ్డలు తింటున్నారా?

25
- Advertisement -

ఆలు గడ్డ కర్రీనే కాదు చిప్స్‌ కూడా అందరికి నచ్చుతాయి. ముఖ్యంగా ఆలుగ‌డ్డ‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో శ‌రీరంలో రక్తం ప్ర‌స‌ర‌ణ స‌రిగా జ‌రుగుతోంది. ఆలుగ‌డ్డ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల క‌ళ్ల కింద వ‌చ్చే న‌ల్ల‌ని మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.

అయితే ఆలుగడ్డలను సరిగ్గా నిల్వచేయకపోతే పాడైపోతాయి. కొన్ని సందర్భాల్లో మొలకెత్తుతాయి కూడా. అయితే ఇలా మొలకలు వచ్చినప్పుడు మనం ఆ మొలకలను తీసివేసి మళ్లీ వండుకుంటూ ఉంటాము. అయితే మొలకెత్తిన బంగాళదుంపలు తినడం మంచిదానా అన్న సందేహం ఇప్పుడు అందరిలో నెలకొంది.

నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ ప్రకారం, మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను అస్సలు వాడకూడదు. కుళ్ళిన బంగాళాదుంపలను తినడం వల్ల మీ శరీరంలో గ్లైకోఅల్కలాయిడ్స్ అధికంగా చేరి, కడుపునొప్పి, విరేచనాలు , వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే తక్కువ రక్తపోటు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు కూడా ప్రవాహంతో వస్తాయి.కాబట్టి మొలకెత్తిన,కుళ్లిన బంగాళదుంపలను అస్సలు తినకూడాదు.

Also Read:తెలంగాణ ప్రభుత్వానికి షాక్..

- Advertisement -