కూరగాయలలో ఎక్కువమంచి ఇష్టంగా తినే వాటిలో బంగాళదుంప ఒకటి. దీనితో కర్రీ, సాంబారు, చట్నీ.. ఇలా రకరాల వంటకాలు చేసుకొని అరగిస్తుంటారు. కేవలం కూరలలో మాత్రమే కాకుండా స్నాక్స్ తయారీలో కూడా బంగాళదుంపలను ఉపయోగిస్తుంటారు. వీటితో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే బంగాళదుంపతో చేసిన వంటకాలు గాని, స్నాక్స్ గాని కొందరు తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు ఆలు తో చేసే పదార్థాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు. ఎందుకంటే బంగాళదుంపలో గ్లూకోజ్ ను పెంచే కారకాలు ఉంటాయి. అందువల్ల మధుమేహం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు వీటికి దూరంగా ఉండక తప్పదు..
అలాగే తరచూ ఎసిడిటీతో బాధపడే వారు కూడా బంగాళదుంపకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఊబకాయంతో బాధపడే కూడా ఆలు పదార్థాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఇంకా హైబీపీ, లోబీపీ వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఆలు పదార్థాలను తినకూడదు, ఇవి రక్తపోటు పెరగడానికి మరింత కారణమౌతాయి. ఇంకా కీళ్లనొప్పులు ఉన్నవారు, అల్జీమర్ వ్యాధి గ్రస్తులు కూడా బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా ఆలు విషయంలో జాగ్రత్తగానే ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో చేసిన ఆహార పదార్థాలను మితంగా తింటేనే మంచిదట. అమితంగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:Harishrao: ఫార్ములా ఈ రేస్‌పై చర్చ జరపండి