Dharmapuri Arvind:ఎంపీపై పసుపు రైతుల కన్నెర్ర

102
- Advertisement -

నిజామాబాద్ ఎంపీపై పసుపు రైతులు కన్నెర్ర చేశారు. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. పసుపు రంగులో ఉన్న ఈ పోస్టర్లు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

2019 ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి గెలిచారు. కానీ గెలిచి 5 సంవత్సరాలు కావొస్తున్న పసుపు బోర్డు ఉసేలేదు. తాజాగా లోక్ సభలో పసుపు బోర్డును ఏర్పాటుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చేసి ప్రకటనతో రైతులు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు.

అరవింద్ తీరును ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు అనే ఫ్లెక్సీలు వెలిశాయి. పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నరేండ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -